హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొంది. హబీబ్‌బస్తీలో హైడ్రా ఆక్రమణలు కూల్చేస్తోంది. దీంతో అక్కడి స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. నిర్మాణాలు కూచివేస్తున్న జేసీబీపై స్థానిక జనం రాళ్లు రువ్వారు. వెంటనే నిర్మాణాల కూచివేతను ఆపాలని ఘర్షణకు దిగారు. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో హాబీద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.