చాలామంది నేపాల్‌లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉందనే విషయం ఎవరికీ తెలియదు. ఆమెకు జరిగిన ఓ సంఘటనే జనరేషన్ Z యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా దారి తీసిందని అక్కడి వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే ఆగస్టు ప్రారంభంలో ఓ 11 ఏళ్ల బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడింది. అదే సమయంలో ఓ మంత్రి ప్రభుత్వ కారు ఆ బాలికను ఢీకొంది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. కానీ అక్కడ నుంచి కారు వెళ్లిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై ప్రభుత్వాన్నే పడగొట్టారు.