TG: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ను BRS పార్టీనే నిద్ర లేపిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు BRS అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. "నువ్వు మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్ రెడ్డి. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం." అని హరీష్ ట్వీట్ చేశారు.