రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి: జన్‌ జడ్‌ డిమాండ్

హిమాలయ దేశం నేపాల్‌లో ప్రజాగ్రహం తీవ్రస్థాయికి చేరడంతో రాజకీయ సంక్షోభం చెలరేగింది. అల్లర్ల నియంత్రణకు సైన్యం రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈ పరిస్థితుల్లో జన్‌-జడ్‌ యువత తమ డిమాండ్లను ముందుకు తెచ్చింది. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని, మూడు దశాబ్దాల రాజకీయ అవినీతిపై దర్యాప్తు జరపాలని, నిరుద్యోగం-వలసలు అరికట్టాలని స్పష్టం చేసింది. తమ ఉద్యమం ఏ ఒక్క పార్టీ కోసం కాదని, దేశ భవిష్యత్తు కోసం అని జన్‌-జడ్‌ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్