TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట(C) చెందిన లావణ్య, రాంబాబు దంపతులు అభిమానంతో తమ కుమారుడికి పేరు పెట్టాలని కేటీఆర్ వద్దకు తమ బిడ్డను తీసుకువచ్చారు. వారి విజ్ఞప్తికి భావోద్వేగానికి గురైన కేటీఆర్, ఆ చిన్నారి యోగక్షేమాల గురించి ప్రేమగా మాట్లాడారు. బ్రాహ్మణులు సూచించిన అక్షరంతో తన కొడుకు హిమాన్షు పేరును గుర్తు చేసుకుంటూ, 'సు' అక్షరంతో 'సూర్యాంశ్' అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు. దీంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.