TG: బీడీ కార్మికులు పడుతున్న కష్టాలు పగవారికి కూడా రావద్దని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రోజంతా కష్టపడి బీడీలు చేస్తే వారు సంపాదించేది కేవలం రూ. 200 మాత్రమేనని అన్నారు. నడుము నొప్పి, మెడ నొప్పి లాంటి అనారోగ్య సమస్యలు అదనంగా కొని తెచ్చుకోవడం లాంటివేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ. 2000 ఫించన్ ఇచ్చేదని గుర్తు చేశారు.