ఐడియా అదిరింది... ఎన్నికల థీమ్‌తో దుర్గామండపం

బిహార్‌లోని సీతామఢిలో దసరా పండగ సందర్భంగా ఎన్నికల థీమ్‌లో దుర్గామండపం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అక్కడి నిర్వాహకులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఆకారంలో మండపాన్ని నిర్మించారు. 17 దేవతలకు వివిధ చిహ్నాలు కేటాయించగా, 18వ స్థానాన్ని NOTA కోసం రిజర్వ్ చేశారు. వీవీపీటీఎట్‌ మెషిన్ల ద్వారా పేపర్‌బ్యాలెట్ విధానాన్ని కూడా పరిచయం చేశారు. 6 అమ్మవార్లు, 11 పురుష దేవతలతో మహిళా రిజర్వేషన్ల (35%)పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్