ఇవాళ ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే ప్రకాశవంతంగా మెరుస్తున్న చంద్రుడిని ప్రజలు సెల్ ఫోన్లలో బంధిస్తూ ఆనందిస్తున్నారు. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి కాంతితో ప్రకాశిస్తాడని సమాచారం. మరి మీరు చందమామను చూశారా?