వీధి కుక్కుల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. నగరం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పులు చేసింది. కేవలం రేబిస్ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టరాదని, శాశ్వతంగా షెల్టర్లలో పెట్టకూడదని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు ఇచ్చింది.