కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎల్బీనగర్‌ చౌరస్తాలో ఆయన 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఇదే సమయంలో, బీసీ రాజ్యాధికార సమితి బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్