తల్లిదండ్రులకు గుడి కట్టిన కుమారుడు

TG: మెదక్‌ (D) నర్సాపూర్‌ (M) రుస్తుంపేటకు చెందిన హోమియో వైద్యుడు దండెపు బస్వానందం తన తల్లిదండ్రులపై ప్రేమను చాటాడు. తల్లిదండ్రులైన ఈశ్వరప్ప, పెంటమ్మలకు ఆయన రెండేళ్ల క్రితం ఆలయాన్ని నిర్మించారు. పాలరాతితో విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్ఠించారు. బస్వానందం, తన అన్న సిద్ధిరాములతో కలిసి నిత్యం పూజలు చేస్తున్నారు. ‘మా నాన్న వ్యవసాయం చేసే నన్ను డాక్టర్ చదివించారు. వారు స్వేదం చిందించిన భూమిలో గుడి కట్టాను’ అని  తెలిపారు.

సంబంధిత పోస్ట్