హిడెన్ యాప్‌లతో ఫోన్లకు పొంచి ఉన్న ముప్పు

మీ ఫోన్‌లో వైరస్ ఉందా? లేదా? ఒకసారి చెక్ చేసుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెయిల్, మెసేజ్‌లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా ఆటోమెటిక్‌‌గా కొన్ని రకాల హిడెన్ యాప్‌లు మన ఫోన్లలో డౌన్‌లోడ్ అవుతాయి. ఈ యాప్‌లు మన ఫోన్లలో ఎంత వెతికినా కనిపించవు. కానీ తెరవెనుక రన్ అవుతుంటాయి. ఇలాంటి యాప్‌‌ల ద్వారా మీ వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశముందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అనుమానాస్పద యాప్‌లు కనిపిస్తే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్