TG: పేదల సంక్షేమం, రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు రుణమాఫీ, మద్దతు ధరతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి అర్హుడికి గృహకల్పన చేస్తామన్నారు. ప్రజాదర్బార్ ద్వారా భూ సమస్యలు, సాదా బైనమా వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.