గుజరాత్‌లోని జూనాగఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విశావదర్ తాలూకాలోని రిమోట్ గ్రామంలో అన్నను తమ్ముడు(15) చంపాడు. ఈఘటనను చూసిన 6 నెలల గర్భిణీగా ఉన్న వదిన ఊరిలో అందరికీ చెప్పేస్తుందేమోనని.. ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. ఆతర్వాత తల్లి, చిన్నకొడుకు కలిసి దంపతుల మృతదేహాలను ఇంటివెనుక గొయ్యిలో పాతిపెట్టారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 31న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.