నిమ్మ ఆకులు కూడా నిమ్మకాయల మాదిరిగానే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. నిమ్మ ఆకుల టీ తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా మారుతుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఉండటంతో రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు తగ్గుతాయి. నిమ్మ ఆకులను పేస్ట్‌గా రాసుకుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.