ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్లేయర్స్‌ను ఖరారు చేశాయి. భారత్ తరఫున అభిషేక్, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.. పాక్ తరఫున సాహిబ్‌జాదా ఫర్హాన్, సయిమ్ అయూబ్, మహ్మద్ హారిస్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ ఆడనున్నారు.