కంది పంట ఆహారంలో ప్రోటీన్ ప్రధాన వనరుగా, నేలలో నైట్రోజన్ నిల్వచేసే పంటగా ప్రసిద్ధి. అయితే పచ్చదోమ, ఆకుముడుత పురుగు, హెలికోవరా, మచ్చల పురుగుల దాడితో పంట దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ, ఆకుముడుత పురుగులు ఆకుల రసం పీల్చి పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. పెనుబంక పురుగులు ఆకులు, పూత, కాయలను తింటాయి. హెలికోవరా పురుగు పూత దశలో గుడ్లు పెట్టి పుష్పాలు, కాయలను నాశనం చేస్తుంది. మచ్చల పురుగు, కాయ తొలుచు ఈగ పూత, కాయలను పాడు చేస్తాయి.