సూర్యగ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, మతపరమైన పనులు చేయరాదని పండితులు సూచిస్తున్నారు. దేవుడి విగ్రహాలు, చిత్రపటాలను ముట్టుకోకూడదు, గుడికి వెళ్లకూడదు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం, నిద్రపోవడం కూడా నిషేధమని చెబుతున్నారు. అయితే గ్రహణ సమయంలో మంత్ర పఠనం అత్యంత శుభప్రదమని, ముఖ్యంగా ఓం నమః శివాయ, మహా మృత్యుంజయ మంత్రాలను జపించడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని విశ్వాసం.