నదిని ఈదుతూ.. మంచంపై గర్భిణిని తీసుకెళ్లారు (వీడియో)

జార్ఖండ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాలము గ్రామానికి చెందిన చంపా కుమారి అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో గర్భిణిని కాపాడేందుకు గ్రామస్తులు ముందుకు కదిలారు. 22 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 1.5 కిలోమీటర్లు నడిచారు. మార్గం మధ్యలో దురియా నది అడ్డొచ్చింది. ఆమెను మంచంపై మోసుకుని ఛాతిలోతు వరకు నీటి ప్రవాహాన్ని దాటి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్