తన విజయం ప్రతి భారతీయుడి విజయమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం కావాలంటే ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదన్నారు. ప్రస్తుతం మనం దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో దేశాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమేనన్నారు.