తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ‘మరణ వాంగ్మూలం’ అంటూ ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టు చేశారు. ‘‘నా జీవితం ముగియబోతోంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తు బుట్టదాఖలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడూ సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తా’ అని నళిని తన లేఖలో పేర్కొన్నారు. ఈమె రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో ఇబ్బంది పడుతోంది.