ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు: రామచందర్‌రావు

TG: కరీంనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు 2028లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్రం రూ.40 వేల కోట్ల ఎరువులను రాయితీపై అందిస్తోందని, ఎరువుల కొరతపై కేంద్రాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్