తెగిపడిన హైటెన్షన్ వైరు.. ముగ్గురు మృతి (వీడియో)

ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పండగ నేపథ్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. మ్యాచ్ చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కబడ్డీ మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్.. హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు తగలడంతో వైరు తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్