తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలం భూంపురం గ్రామంలో పిడుగుపడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. పొలంలో పని చేస్తున్న క్రమంలో పిడుగు పడటంతో పార్వతమ్మ (22), సర్వేష్ (20), సౌభాగ్య(40) అనే ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భూంపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.