తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

జైపూర్‌లో అనారోగ్యంతో మరణించిన ఏటీఎస్‌ అధికారిణి జోగిందర్ కౌర్‌ మృతదేహాన్ని సొంతూరుకు తరలిస్తుండగా, ఆమెను అనుసరిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కౌర్ కుమారుడు కిరాత్, సోదరి కృష్ణ, బంధువు సచిన్ అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రోహ్‌తక్‌లోని ఫ్లైఓవర్‌పై ఈ దుర్ఘటన జరిగింది. మరో బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్