సాయంత్రంలోపు ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలలోపు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.  మిగిలిన జిల్లాల్లో గంటకు 5 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్