మహారాష్ట్రలో మూడేళ్ల వయసున్న ఓ మగ పులి యవత్మాల్ జిల్లా టిపేశ్వర్ నుంచి బయలుదేరి 450 కి.మీ. ప్రయాణం చేసి ధారాశివ్ జిల్లాలో గల యెడ్శీ రామ్‌లింగ్ ఘాట్ అభయారణ్యం చేరుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మీదుగా ప్రయాణించి కొత్తగా వచ్చి చేరిన పులికి సమీపంలోని శివాలయం పేరు మీద ‘రామ్‌లింగ్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అటవీశాఖ అమర్చిన కెమెరాల ఆధారంగా కొత్త పులి కదలికలను గుర్తించామన్నారు.