ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శనతో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ పాపులారిటీ సరిహద్దులు దాటింది. దాయాది పాక్‌లోనూ అతడికి ఫాలోయింగ్ పెరిగింది. తిలక్ ఆటను వీక్షిస్తూ పాక్ యువతులు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ జట్టు ఓడినప్పటికీ, వారు ‘తిలక్.. జై మాతా దీ’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.