ఆసియా కప్ ఫైనల్‌లో దాయాది పాక్‌ను భారత్ మట్టికరిపించింది. తొలుత కష్టాల్లో పడిన టీమిండియాను తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయ తీరాలకు చేర్చాడు. చివరి 5 బంతుల్లో 8 రన్స్ అవసరం కాగా రవూఫ్ బౌలింగ్‌లో తిలక్ సిక్స్ కొట్టారు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. ఈ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న గంభీర్ సంతోషంతో అరుస్తూ ముందున్న టేబుల్ బలంగా బాదారు. ఈ మాస్ సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం SMలో వైరలవుతోంది.