తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవాలలో 5వ రోజున, ఆదివారం స్వామి వారు గరుత్మంతునిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనంపై స్వామి వారిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు, మరో 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. గరుడ సేవ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు, 2 వేల సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.