తిరుమల శ్రీవారి లడ్డూ ధర పెంపు.. క్లారిటీ

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరను పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ‘శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరను పెంచుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పులు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే టీటీడీకి లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్