రన్‌వేపై మొరాయించిన తిరుపతి విమానం (వీడియో)

TG: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై అలయన్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9ఐ-877 విమానం మొరాయించింది. 50 మంది ప్రయాణికులతో ఉదయం 7.15 గంటలకు తిరుపతికి వెళ్లడానికి రన్‌వేపైకి వెళ్లింది. టేకాఫ్‌ సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్‌ గమనించి ఏటీసీకి సమాచారం అందించాడు. ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు సర్వీస్‌ను రద్దు చేసినట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రయాణికులు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్