ఆగస్టు 29న విడుదలైన ‘త్రిబాణదారి బార్బరిక్' సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ చూసేందుకు 10 మంది ప్రేక్షకులు కూడా రాకపోవడంతో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బోరున ఏడ్చారు. సినిమా విడుదలకు ముందు ‘నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా’ అని ఛాలెంజ్ చేసిన ఆయన తాజాగా తన చెప్పుతో కొట్టుకున్నారు. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డా. నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య భయపడుతోంది' అని వాపోయారు.