కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ కీలక పిలుపు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు ఈ బైపోల్‍ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇది కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశమని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు సమయం ఉందని, ఈ సమయం చాలా కీలకం అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కాంగ్రెస్ విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్