వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన వ‌రి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్ట‌ర్‌(వీడియో)

TG: కామారెడ్డి జిల్లా చిన్న దేవాడ శివారులోని కౌలస్ వాగులో వ‌రి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్ట‌ర్‌ కొట్టుకుపోయింది. వరి ధాన్యం లోడ్ తో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే టెస్టింగ్ పేరిట కౌలస్ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తడంతో ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. దీంతో ట్రాక్టర్‌ను వాగులోనే వదిలేసి రైతు ప్రాణాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. వాగు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయకుండా గేట్లు ఎలా ఎత్తుతారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్