AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నందిగామలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మాగం నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కళాశాల నుంచి స్నేహితురాళ్లతో సదరు విద్యార్థిని బయటకు వచ్చింది. ఈ సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్నేహితురాళ్లు ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు.