టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వైవీఎస్ తల్లి రత్నకుమారి(88) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఆమె నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని చౌదరి తెలియజేశారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.