యూపీలోని షాజహాన్‌పూర్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. విద్యుత్ షాక్‌కు గురైన తండ్రిని కాపాడే క్రమంలో కుమార్తె మరణించింది. రామ్‌నగర్‌లో మంగళవారం రామవతార్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడే క్రమంలో చేయి పట్టుకోవడంతో కుమార్తె కిరణ్ (15)కు సైతం కరెంట్ షాక్ తగలడంతో మరణించింది. ఈ ఘటనలో కుమార్తెతో పాటు తండ్రి రామవతార్ కూడా మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.