పండుగ వేళ విషాదం.. భర్త కళ్లెదుటే భార్య మృతి

AP: విశాఖలోని కూర్మన్నపాలెం సమీపంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పెదగంట్యాడ మండలానికి చెందిన వియ్యపు ఉమాదేవి (22) తన భర్త పైడిరాజుతో కలిసి బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఉమాదేవి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లైన ఏడాదికే భర్త కళ్ల ముందే భార్య మరణించడం విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్