చెత్త బండిలో మెడిసిన్స్ తరలింపు.. కాంట్రాక్ట్ వైద్యురాలు సస్పెండ్

తమిళనాడు చెన్నైలో ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి మెడిసిన్స్‌ చెత్త బండిలో తరలించిన ఘటన గుర్తించబడింది. ఉత్తర చెన్నైలోని ముతమిజ్ నగర్ నుండి 1.5 కిమీ దూరంలోని కొడుంగైయుర్ హెల్త్ సెంటర్‌కు మందులు డస్ట్ బిన్ ట్రక్కులో తీసుకెళ్లారు. ఈ విషయంలో బాధ్యత వహించిన కాంట్రాక్ట్ మహిళా డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు విచారణ ఆదేశించారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ప్రభుత్వాన్ని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్