2025 నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు లభించింది. నార్వే రాజధాని ఒస్లోలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈరోజు ఈ కీలక ప్రకటన చేసింది. వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల రక్షణ, నిరంకుశ పాలనకు వ్యతిరేక శాంతియుత పోరాటం ఆమెను ఈ బహుమతికి అర్హురాలుగా నిలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వస్తుందని అనుకున్న ఈ బహుమతి మచాడోకు రావడంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.