రష్యా-ఉక్రెయన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం మొదట్లో సులభం అనుకున్నాను అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఈ ఉద్రిక్తతలను సులువుగా ఆపగలనని భావించినట్లు ట్రంప్ తెలిపారు. కానీ, ఇప్పుడిదే అత్యంత కష్టంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.