ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా, చైనా అణ్వాయుధ కార్యక్రమాలు విస్తరిస్తున్న నేపథ్యంలో, అమెరికాలో అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించారు. ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ, ప్రపంచంలోనే ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్నామని, అయితే ఇప్పుడు వేరే మార్గం లేదని, రష్యా, చైనా తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యా స్థాయికి చేరుకోగలవని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

సంబంధిత పోస్ట్