ట్రంప్‌ కఠిన ఆంక్షలు.. క్షీణించిన వలస జనాభా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఆ దేశానికి వచ్చే వలసదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ సంఖ్య దాదాపు 1.5 మిలియన్లకు చేరుకుంది. ఇంత భారీగా వలసదారులు ఆగిపోవడం 1960 తర్వాత ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ విధానాలు, అరెస్టులు, ప్రవేశ నిబంధనల కఠినతరం కారణంగా వలసలు తగ్గాయన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 53.3 మిలియన్లుగా ఉండే వలసలు తర్వాత 51.9 మిలియన్లకు పడిపోయిందని ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదికను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్