క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వర్ణ విగ్రహాన్ని అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నారు. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.