గుడ్ న్యూస్.. దసరాకు టీఎస్ఆర్టీసీ నుంచి 7,754 స్పెషల్ బస్సులు

TG: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టాండ్స్ ఏర్పాటు చేసింది. పండుగ ఛార్జీలు 2013 నాటి జీవో ప్రకారం మాత్రమే ఉంటాయని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తుండటంతో తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్