రూ.85 వేల వరకు తగ్గిన టీవీల ధరలు

అర్ధరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడంతో పలు టీవీల కంపెనీలు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. కాగా టూవీలర్స్ వాహనాలపై రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్