AP: తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణయ్య అనే వ్యక్తి పొలానికి ట్రాక్టర్ పై వెళ్తుండగా.. 'మేము వస్తాం నాన్న' అంటూ ఇద్దరు మనవరాళ్లు, మనవడు మారం చేయడంతో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణయ్య పొలాన్ని దున్నతుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి చిన్నారులు కుందన(11), దివాన్(3) చనిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.