విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల హల్‌చల్‌

ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానంలో సోమవారం ఇద్దరు మహిళలు హల్‌చల్‌ చేశారు. విమానాన్ని టేకాఫ్‌ చేసే సమయంలో ఇద్దరు మహిళలు తమ సీట్లలో నుంచి లేచి గొడవపడ్డారు. సిబ్బంది అడ్డుకున్నా వినిపించుకోకుండా కాక్‌పిట్‌లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది చెప్పినా తమ సీట్లలోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో సిబ్బంది వారిని విమానం నుంచి దింపి సీఐఎస్ఎఫ్‌కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్