రెండు స్వర్ణ పతకాలు.. అదరగొట్టిన భారత అథ్లెట్‌

వరల్డ్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ ఆనంద్‌కుమార్‌ వెల్‌కుమార్‌ అద్భుత ప్రతిభ చాటాడు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. ఆదివారం నిర్వహించిన 42km  మెన్స్‌ మారథాన్‌లో తొలి స్థానంలో నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో 2 సార్లు విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా ఆనంద్‌ రికార్డు సాధించాడు. ఇటీవలే 1000 మీటర్ల స్ప్రింట్‌లో ఆనంద్‌ స్వర్ణ పతకాన్ని సాధించగా.. తాజాగా మారథాన్‌లో మరో పతకాన్ని అకౌంట్లో వేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్